![]() |
![]() |

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు మహేష్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన నవీన్ కి రెండు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ఏడాది 'పఠాన్'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దీంతో ఆయన తాజా చిత్రం 'జవాన్'పై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే 'జవాన్' విడుదలవుతున్న రోజే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదలవుతుండటంతో.. షారుఖ్ సినిమాతో పోటీ పడటం ఎలా ఉందనే ప్రశ్న మీడియా నుంచి నవీన్ కి ఎదురైంది.
"నేను షారుఖ్ గారికి వీరాభిమానిని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరో అవ్వాలనే గోల్ ఉన్నవారికి షారుఖ్ గారు స్ఫూర్తి. ఒక అభిమానిగా ఆయన సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను. ఆయన పఠాన్ తో కమ్ బ్యాక్ ఇవ్వడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. మాన్ స్టర్ లాంటి ఆయన సినిమాతో పోటీ అంటే మొదట కొంచెం భయపడ్డాను. అయితే మా ధైర్యం ఏంటంటే ఇది మన తెలుగు సినిమా. తెలుగులో ఒక మంచి సినిమా వస్తే మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు." అని నవీన్ బదులిచ్చారు.
అలాగే అనుష్క మూవీ ప్రమోషన్స్ కి రాకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నకు స్పందించిన నవీన్.. "ఆమె సిటీలో లేరు. వచ్చాక ఆమె స్టైల్ లో ఆమె ప్రమోట్ చేస్తారు. ఇప్పటికే సుమ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాం. అలాగే ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటారు" అన్నారు.
![]() |
![]() |