
షారూక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విక్రమ్ రాథోడ్‌గా, ఆజాద్ రాథోడ్‌గా షారూక్‌రెండు విభిన్నమైన పాత్రలు చేశారు. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా హై ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన షారూక్ తాజాగా తిరుమలకి వెళ్ళి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. షారూక్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఆయనతో ఉన్నారు. మరో పక్క హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ కూడా అదే సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ సంప్రదాయంలో తెల్లటి పంచె, తెల్ల షర్ట్‌తో షారూక్ కనిపించగా, ఆయన కుమార్తె సుహానా కూడా తెల్లటి చుడీదార్ ధరించారు. నయన్ దంపతులు కూడా తెల్లటి వస్త్రాలతో స్వామివారి దర్శనానికి వచ్చారు.
ఇప్పటికే ‘జవాన్’ చిత్రానికి చాలా హైప్ వచ్చింది. ఎంతో రిచ్‌గా, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించనుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ టికెట్స్ భారీగా అమ్ముడు పోయాయి. మొదటిరోజు రూ.75 కోట్ల వరకు కలెక్ట్ చేయనుందని టాక్. ఇప్పటివరకు మొదటిరోజు పఠాన్ రూ.55 కోట్లు, బాహుబలి 2 రూ.58 కోట్లు, కెజిఎఫ్ రూ.61 కలెక్ట్ చేశాయి. వాటన్నింటినీ ‘జవాన్’ క్రాస్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.