![]() |
![]() |
సినిమా రంగంలో జయాపజయాలు సర్వసాధారణం. కొంతమంది హీరోలు ఎంతో ఇష్టపడి, మరెంతో కష్టపడి చేసిన సినిమాలు డిజాస్టర్స్‌గా నిలుస్తాయి. కొన్ని సందర్భాల్లో అంత సీరియస్‌గా తీసుకోకుండా చేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అవుతుంటాయి. ఇవన్నీ సహజమే. ఫ్లాప్ వచ్చినపుడు కుంగిపోయి, సక్సెస్ వచ్చినపుడు పొంగిపోకుండా ఉండేవారే లాంగ్ కెరీర్‌ని చూడగలుగుతారు. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. తన కెరీర్‌లో సక్సెస్‌లు చూశాడు, ఫ్లాపులు చూశాడు. అయితే ఎంతో ఆత్మవిశ్వాసంతో తన టాలెంట్‌ని నమ్ముకున్న విజయ్ ‘ఖుషి’తో మరోసారి ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఆ సంతోషాన్ని తనలోనే ఉంచుకోకుండా అందరితోనూ పంచుకోవాలనుకున్నాడు. అందుకే ఒక మహత్కార్యానికి శ్రీకారం చుట్టాడు. తన సంపాదన నుంచి 1 కోటి రూపాయలను వంద కుటుంబాలకు అందజేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సంకల్పించాడు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా, తక్కువ స్థాయిలో వున్న వారైనా వారి పరిధి మేరకు ఎదుటివారికి సాయం చేయాలన్న తత్వం వుంటే ఎంతోమందికి అది ఉపయోగపడుతుంది. ఈమధ్య ఎంతో మంది హీరోలు వారి వారి స్తోమతకు తగ్గట్టు సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కోటి రూపాయలు తన అభిమానుల కుటుంబాలకు అందిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాడు.
![]() |
![]() |