![]() |
![]() |
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎన్నో బ్లాక్‌బస్టర్స్ చూశారు. మరెన్నో రికార్డులు క్రియేట్ చేశారు. తన సినిమాల కలెక్షన్లతో బాక్సాఫీసులు బద్దలు కొట్టారు. అయితే లేటెస్ట్ మూవీ ‘జైలర్’కి వచ్చిన రిజల్ట్ మాత్రం అపూర్వం అనే చెప్పాలి. ఇప్పటికే రూ.600 కోట్ల క్లబ్‌లో చేరి రజనీకాంత్ కెరీర్‌లో ఈ క్లబ్‌లో చేరి రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తోంది. కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ టోటల్ కలెక్షన్ నంబర్‌ని పెంచుకుంటూ పోతోంది. అలాగే చిత్ర నిర్మాత కళానిధి మారన్ కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ పోతున్నాడు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు అందరికీ చెక్కుల కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్నాడు. ఆమధ్య హీరో రజనీకాంత్‌కి రూ.100 కోట్ల చెక్‌తోపాటు ఖరీదైన కారును ప్రజెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డైరెక్టర్ నెల్సన్‌కి కూడా చెక్, కారు బహుమతిగా అందించారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌కి చెక్‌తోపాటు కారును ఇచ్చారు. డైరెక్టర్‌కిగానీ, మ్యూజిక్ డైరెక్టర్‌కి గానీ ఇచ్చిన చెక్‌లో ఎంత ఎమౌంట్ వుందనే విషయం తెలియదుగానీ మొత్తానికి భారీ ఎమౌంట్ అయివుంటుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ చెక్‌ల, బహుమతుల పర్వం ఈ ముగ్గురితో ఆగుతుందా? ఇంకా కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |