![]() |
![]() |

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో `సలార్`, `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్` వంటి పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే, వీటన్నింటికంటే ముందు మరో సినిమాతో పలకరించబోతున్నట్లు టాక్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ.. హారర్ కామెడీ జోనర్ లో రూపొందనుందని సమాచారం. అంతేకాదు.. ఇదే ఏడాది ఈ సినిమా రిలీజ్ కావచ్చని అంటున్నారు.
ఇదిలా ఉంటే, ప్రభాస్ - మారుతి కాంబో మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరాని ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఓ ఇంటి చుట్టూ తిరిగే ఈ హారర్ కామెడీ మూవీలో బోమన్ దెయ్యం పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట. ఈ పాత్ర, బోమన్ నటన.. సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయంటున్నారు. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రభాస్ - మారుతి కాంబినేషన్ మూవీ మే నుండి సెట్స్ పైకి వెళ్ళనుందని, డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా, శ్రీ లీల కథానాయికలుగా నటించే అవకాశముందని చెప్పుకుంటున్నారు.
![]() |
![]() |