![]() |
![]() |

ఛాయాగ్రాహకుడిగా సెంథిల్ కుమార్ ది దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం. `ఐతే` (2003)తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ని ప్రారంభించిన సెంథిల్.. ఇప్పటివరకు 15 సినిమాలతో పలకరించాడు. రేపు (మార్చి 25) రిలీజ్ కానున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్`.. సెంథిల్ కుమార్ కి 16వ చిత్రం. అంతేకాదు.. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో తనకిది ఎనిమిదో సినిమా.
`సై` (2004), `ఛత్రపతి` (2005), `యమదొంగ` (2007), `మగధీర` (2009), `ఈగ` (2012), `బాహుబలి - ది బిగినింగ్` (2015), `బాహుబలి - ది కంక్లూజన్` (2017).. ఇలా ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఏడు సినిమాలు చేశాడు సెంథిల్ కుమార్. అవన్నీ కూడా ఘనవిజయం సాధించాయి. మరి.. `ఆర్ ఆర్ ఆర్`తో జక్కన్న కాంబినేషన్ లో సెంథిల్ ఎనిమిదో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
కాగా, `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, విదేశీ సోయగం ఒలివియా మోరీస్ తో పాటు ప్రముఖ హిందీ నటుడు అజయ్ దేవగణ్, అందాల తార శ్రియ ముఖ్య పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు.
![]() |
![]() |