![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యూత్ స్టార్ నితిన్.. ఈ ముగ్గురు టాలీవుడ్ స్టార్స్ కూడా కొత్త చిత్రాల కోసం ఒకే బాటలో పయనిస్తున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.

ఆ వివరాల్లోకి వెళితే.. రవితేజ కథానాయకుడిగా `రామారావు ఆన్ డ్యూటీ` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శరత్ మండవ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు రవితేజ. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ - ఇండియా మూవీలో తనది ఎలక్షన్ కమీషనర్ రోల్ అని బజ్. అలాగే, నితిన్ సంగతికి వస్తే `మాచర్ల నియోజక వర్గం` పేరుతో ఓ పొలిటికల్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడట నితిన్. మొత్తమ్మీద.. రవితేజ, రామ్ చరణ్, నితిన్.. ఇలా ప్రముఖ కథానాయకులంతా త్వరలో ప్రభుత్వ అధికారులుగా దర్శనమివ్వబోతున్నారన్నమాట. మరి.. ఆయా పాత్రలతో ఈ స్టార్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.

కాగా, `రామారావు ఆన్ డ్యూటీ` జూన్ 17న రిలీజ్ కానుండగా.. `మాచర్ల నియోజక వర్గం` ఇదే ఏడాది తెరపైకి రానుంది. చరణ్ - శంకర్ కాంబో మూవీ 2023 సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.
![]() |
![]() |