![]() |
![]() |

తమిళ దర్శకుడు తమిర కొవిడ్-19 సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సోమవారం మృతి చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. 'రెట్టైసుళి', 'ఆన్ దేవతై' లాంటి సినిమాల ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. తమిరకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
కె. బాలచందర్, భారతీరాజా లాంటి లెజెండరీ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు తమిర. 2010లో రూపొందిన 'రెట్టైసుళి' సినిమాతో డైరెక్టర్‌గా మారారు. అందులో తన గురువులు బాలచందర్, భారతీరాజా ఇద్దరినీ తమిర డైరెక్ట్ చేయడం విశేషం. ఆ ఇద్దరూ ఆ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు.
తమిర మృతి గురించి సోషల్ మీడియాలో తొలిగా పోస్ట్ చేసి సంతాపం వ్యక్తం చేసిన వారిలో భారతీరాజా ఉన్నారు. తమిర తనతో పనిచేసిన అనుభవాలను ఆయన గుర్తు చేసుకొని, తమిర ఫ్యామిలీకి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు నటులు, మ్యూజిక్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు ట్విట్టర్ ద్వారా సంతాపాలను షేర్ చేసుకున్నారు.
తమిర డైరెక్ట్ చేసిన రెండో సినిమా 'ఆన్ దేవతై' 2018లో విడుదలైంది. ఆ మూవీలో సముద్రకని, రమ్య పాండ్యన్, కవిన్, మోనిక నటించారు. లేటెస్ట్‌గా ఆయన 'మై పర్ఫెక్ట్ హజ్బెండ్' అనే వెబ్ సిరీస్ రూపొందించారు. అందులో సత్యరాజ్, సీత ప్రధాన పాత్రలు పోషించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కావడానికి అది సిద్ధంగా ఉంది.
![]() |
![]() |