![]() |
![]() |

ఎంఎస్ రాజుగారు ఉన్నారు కదా! మహేష్ బాబు హీరోగా 'ఒక్కడు', ప్రభాస్ హీరోగా 'వర్షం' వంటి భారీ హిట్ సినిమాలు నిర్మించారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో తెలుగులో సిద్ధార్థ్‌కి స్టార్‌డమ్ తీసుకొచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'డర్టీ హరి'. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు.
"థియేటర్లు ఓపెన్ కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అందువల్ల, ఒక వారంలో ఓటీటీ విడుదలపై నిర్ణయం తీసుకుంటాను" అని ఎంఎస్ రాజు తెలిపారు. హైదరాబాదీ యువకుడు శ్రవణ్ రెడ్డిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో సిమ్రత్ కౌర్, రుహనీ శర్మ హీరోయిన్లు. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కమర్షియల్ సినిమాలు ప్రొడ్యూస్, డైరెక్ట్ చేసిన ఎంఎస్ రాజు, 'డర్టీ హరి'ని బోల్డ్ గా తీశారు. లాక్‌డౌన్‌కి ముందే సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేశారట.
![]() |
![]() |