![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఇండియాకి ఇటలీని తెస్తున్నారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో బాహుబలి స్టార్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'రాధేశ్యామ్' టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు టాక్. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిది. ప్లాన్ ప్రకారం జూన్‌లో ఇటలీ, ఆస్ట్రియా వెళ్లి షూటింగ్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో రెండేళ్లు విదేశాలు వెళ్లే అవకాశాలు లేవు. అందుకని, ప్రభాస్ కోసం ఇండియాకి ఇటలీని తెస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ స్టూడియోలో ఇటలీ బ్యాక్‌డ్రాప్ సెట్స్ వేస్తున్నారు.
సుమారు 5 కోట్ల రూపాయలతో 'రాధేశ్యామ్' కోసం హాస్పిటల్ సెట్స్ వేస్తున్నారట. ఐసీయూ, స్పెషల్ వార్డ్, జనరల్ వార్డ్, డాక్టర్ రూమ్ వంటివి తాజాగా వేస్తున్నట్టు సెట్స్ అని తెలిసింది. అంతకు ముందు హీరోయిన్ హౌస్ సెట్ కూడా వేశారు. ఆస్ట్రియాలో తీయాల్సిన సన్నివేశాలు, పాటలను పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తరవాత జార్జియాలో తీస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.
![]() |
![]() |