![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఎఫెక్ట్ బాలీవుడ్ స్టార్ కిడ్స్ మీద, వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ల మీద బలంగా పడుతోంది. సుశాంత్‌పై కొంతమంది ప్రేక్షకులకు ఉన్న ప్రేమాభిమానాలు, వారసత్వంతో వచ్చినవాళ్లపై ద్వేషంగా మారుతున్నాయి.
బాయ్‌కాట్ సల్మాన్, బాయ్‌కాట్ స్టార్ కిడ్స్, బాయ్‌కాట్ బాలీవుడ్, బాయ్‌కాట్ ఖాన్స్... రకరకాల హ్యాష్‌ట్యాగులు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. సుశాంత్ సూసైడ్ మరోసారి నెపోటిజమ్ డిస్కషన్‌కు దారి తీసింది. కొంతమంది నేరుగా స్టార్స్‌ను ట్యాగ్ చేసి తిడుతున్నారు. రాయలేని భాషలో కామెంట్స్ చేస్తున్నారు.
ట్విట్టర్‌లో నెగిటివిటీ గోల భరించలేక చాలామంది స్టార్స్ తమ అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. ఆమె బాటలో సల్మాన్ బావ ఆయుష్ శర్మ నడిచాడు.
సల్మాన్ చెల్లెలు అర్పితను పెళ్లి చేసుకున్న ఆయుష్ శర్మ, ‘లవ్ రాత్రి’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. కేవలం ఖాన్ ఫ్యామిలీకి అల్లుడు కావడం వల్లే హీరో అయ్యాడని అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకీ గోల అనుకున్నాడేమో... ట్విట్టర్‌కి టాటా చెప్పాడు. సోనాక్షి, ఆయుష్ మాత్రమే కాదు.. సాకిబ్ సలీమ్, జహీర్ ఇక్బాల్ తమ ట్విట్టర్ అకౌంట్స్ క్లోజ్ చేశారు.
సోనమ్ కపూర్, అనిల్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్ తదితరులు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ సెక్షన్‌ని తీసేస్తున్నారు.
![]() |
![]() |