![]() |
![]() |

శిల్పారెడ్డి అంటే సినీ ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టడం కష్టమేమో! ‘బిగ్ బాస్’ ఫేమ్, యాక్టర్ సామ్రాట్ ఉన్నాడు కదా! అతడికి, పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తీ రెడ్డికి అక్క. మోడలింగ్‌లో ఈమెకు మంచి పేరుంది. పైగా, స్టయిలిస్ట్/ఫ్యాషన్ డిజైనర్ కూడా! గతంలో మిసెస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచారు. నాగార్జున ఫ్యామిలీకి బాగా క్లోజ్. అక్కినేని ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో తప్పకుండా కనపడుతుంది. ఫొటోలు షేర్ చేస్తుంది. ఇప్పుడీమె కరోనా బారిన పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రోజు పోస్ట్ చేసిన వీడియోలో స్వయంగా కరోనా సోకిన సంగతి శిల్పారెడ్డి చెప్పారు.

‘‘రెండు వారాల కిత్రం ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు మా ఇంటికి వచ్చారు. ఆరోగ్యం సరిగా లేదని వెళ్లిపోయారు. ఐదు రోజుల క్రితం ఫ్రెండ్ ఫోన్ చేసి, తన కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలారని చెప్పారు. వెంటనే నేను, మా ఆయన కొవిడ్–19 టెస్టులు చేయించుకున్నాం. ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. మాలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. కానీ, వ్యాధి ఉన్నట్టు తెలిసింది. కరోనా ఎలా సోకుతుందనేదానికి మేం టిపికల్ ఎగ్జాంపుల్స్’’ అని శిల్పారెడ్డి వివరించారు. ఇంట్లో ఉండి కరోనా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ మానసికంగా సిద్ధం కావాలని ఆమె చెప్పారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం తినాలో పోస్ట్ చేశారు.
![]() |
![]() |