![]() |
![]() |

"మా నాన్నగారే (ఎస్పీ బాలసుబ్రమణ్యం) లేనప్పుడు నాకు భారతరత్న ఎందుకండీ? మా భారతరత్న మా నాన్నగారే" అని ఎస్పీ చరణ్ అన్నారు. దివికేగిన గానగంధర్వుడు ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు. అందులో నిర్విరామంగా ఐదు దశాబ్దాలపాటు సంగీత ప్రేమికులు అలరించిన బాలు గొప్పతనాన్ని కొనియాడడంతో పాటు వివిధ భారతీయ భాషలలో 40 వేలకు పైగా పాటలను పాడిన సంగతి గుర్తు చేశారు. గతంలో గాయకులు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తదితరులకు భారతరత్న ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
బాలుకి భారతరత్న కోరుతున్న విషయాన్ని ఎస్పీ చరణ్ దగ్గర ప్రస్తావించగా... "గవర్నమెంటు ఒప్పుకుంటే భారతరత్న ఇస్తారు. లేదంటే పర్వాలేదు. నాన్నగారి లేనప్పుడు భారతరత్న నాకెందుకు? మా భారతరత్న నాన్నగారే. ప్రభుత్వం భారతరత్న ఇస్తే సంతోషపడతాం" అని అన్నారు. తండ్రి జ్ఞాపకార్థం సమాధి వద్ద నిర్మించే కట్టడం విషయంలో కుటుంబ సభ్యులందరూ కలసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
![]() |
![]() |