![]() |
![]() |

2018 లో విడుదలైన కన్నడ ఫిల్మ్ 'కేజీఎఫ్ చాప్టర్-1' దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 14 న విడుదల కానున్న 'కేజీఎఫ్ చాప్టర్-2' కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్-2 ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లోనే 100 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
కేజీఎఫ్-2 ట్రైలర్ చూస్తే యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండియర్ పరంగా చాప్టర్-1 ని మించి ఉంటుందని అర్థమవుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా రాక్ స్టార్ యశ్ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "నాకు వైలెన్స్ నచ్చదు.. కానీ వైలెన్స్ కి నేను నచ్చుతాను" అంటూ యశ్ చెప్పిన డైలాగ్స్ మెప్పిస్తున్నాయి. అయితే ఈ మూవీలో డైలాగ్స్ కి సంబంధించి తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సీక్రెట్ రివీల్ చేశాడు. ఈ మూవీలో రాకీ భాయ్ గా యశ్ చెప్పే మెజారిటీ డైలాగ్స్ ఆయన(యశ్) రాసుకున్నవే అని చెప్పి ఆశ్చర్యపరిచాడు.
రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యశ్ పై ప్రశంసలు కురిపించాడు ప్రశాంత్ నీల్. యశ్ లో మంచి యాక్టర్ మాత్రమే కాకుండా మంచి రైటర్ కూడా ఉన్నాడని కొనియాడాడు. ఈ సినిమాలోని తన పోర్షన్ డైలాగ్స్ లో ఎక్కువగా యశ్ రాసినవే ఉన్నాయని.. ఆ డైలాగ్స్ సీన్స్ ఎలివేట్ అయ్యేలా పవర్ ఫుల్ గా ఉంటాయని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |