![]() |
![]() |

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తన అనుభవాన్ని పంచుకున్నాడు తమిళ స్టార్ యాక్టర్ విశాల్. రెండు వారాల క్రితం టెస్టుల్లో విశాల్, ఆయన తండ్రి జి.కె. రెడ్డి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. ఆయుర్వేద మందు వల్లే తామిద్దరం కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్నామని విశాల్ తెలిపాడు. ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో ఆయన షేర్ చేశాడు. నాలుగు నిమిషాల ఆ వీడియోలో తాను, తన తండ్రి ఎలా ఆయుర్వేద మందు సాయంతో పూర్తిగా కోలుకున్నారో ఆయన వివరించాడు. అయితే కొవిడ్-19 బారిన పడ్డవాళ్లకు చికిత్స విషయంలో ఆయుర్వేద మందే బెస్ట్ ఆప్షన్ అని తాను ప్రచారం చెయ్యట్లేదని విశాల్ స్పష్టం చేశాడు.
"మా నాన్నకు పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పుడు, ఆయన పక్కన ఉండాలని అనుకున్నాను. ఆయనను ఏ హాస్పిటల్‌కూ తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకున్నాం. ఆయనకు దగ్గరగా మసలడం వల్ల నేను కూడా ఆ వైరస్‌కు గురయ్యాను. మేం ఆయుర్వేద, హోమియోపతి మందులు తీసుకుంటూ వచ్చాం. ఏడు రోజుల్లో పూర్తిగా రికవర్ అయ్యాం. ఆయుర్వేద మెడిసిన్‌ను ఈ వీడియో ద్వారా ప్రచారం చెయ్యాలని నేను ప్రయత్నించడం లేదు. మమ్మల్ని కాపాడిన మెడిసిన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా" అని విశాల్ చెప్పాడు. ఆయన ప్రస్తుతం 'చక్ర', 'డిటెక్టివ్ 2' సినిమాలు చేస్తున్నాడు.
![]() |
![]() |