![]() |
![]() |
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డేని `రాధే శ్యామ్` రూపంలో అనూహ్య పరాజయం పలకరించింది. ఈ నేపథ్యంలో.. రాబోయే చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ఇట్టే గ్యాప్ లేకుండా ఏప్రిల్ నెలలో కేవలం పదహారు రోజుల వ్యవధిలో ఆమె నటించిన రెండు సినిమాలు థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనున్నాయి.
Also Read: ఎప్పుడో తాతైన దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారు!
ఆ వివరాల్లోకి వెళితే.. దాదాపు పదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం తమిళంలో పూజ నటించిన చిత్రం `బీస్ట్`. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 13న ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులోనూ అనువాద రూపంలో అదే రోజున ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఇక `బీస్ట్` రిలీజైన పదహారు రోజుల తరువాత అంటే ఏప్రిల్ 29న పూజ నటించిన మరో చిత్రం వినోదాలు పంచనుంది. ఆ సినిమానే.. `ఆచార్య`. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో విజనరీ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సోషల్ డ్రామాలో నీలాంబరిగా అలరించనుంది పూజ. మొత్తమ్మీద.. పదహారు రోజుల గ్యాప్ లో పూజా హెగ్డే డబుల్ ధమాకా ఇవ్వనుందన్నమాట. మరి.. `బీస్ట్`, `ఆచార్య` చిత్రాలతో పూజ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |