![]() |
![]() |

తెలుగులో నిర్మాతలుగా మారిన దర్శకులున్నారు. అటువంటి దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి త్వరలో చేరుతున్నారు. నాని హీరోగా 'కృష్ణార్జున యుద్ధం', అక్కినేని నాగచైతన్య హీరోగా 'మజిలీ' చిత్రాలు నిర్మించిన షైన్ స్క్రీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్దితో అనిల్ రావిపూడికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో కలిసి ఆయన ఓ సినిమా నిర్మించనున్నారు. అయితే, అనిల్ డబ్బులు పెట్టడం లేదట. తన పెట్టుబడిగా కథను అందిస్తున్నారని తెలిసింది.
శ్రీవిష్ణు కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ ఓ సినిమా నిర్మించనుంది. దానికి అనిల్ రావిపూడి కథ, మాటలు అందిస్తున్నారు. అలాగే, సమర్పకులుగా వ్యవహరించనున్నారు. తండ్రీకొడుకుల నేపథ్యంలో వినోదం, భావోద్వేగం మేళవించి చక్కటి కథ రాశారట. ప్రస్తుతానికి ఈ సినిమాకి దర్శకుడిని ఎంపిక చేయలేదు. అనీష్ కృష్ణ పేరు పరిశీలనలో ఉందట. ఇందులో శ్రీవిష్ణుకి తండ్రిగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించనున్నారు. అరకులో సినిమా చిత్రీకరణ మొదలుపెట్టి 40 రోజుల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
![]() |
![]() |