![]() |
![]() |

వినోదాత్మక కథలకు వాణిజ్య హంగులు అద్ది సినిమాలు తీసే దర్శకుడు అనిల్ రావిపూడి. కుటుంబ కథలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేసే సత్తా ఉందని 'ఎఫ్ 2'తో నిరూపించాడు. 'ఎఫ్ 2' తర్వాత అతడు చేసిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. మహేష్‌బాబుతో సినిమా అంటే మాటలు కాదు... ఒక రకంగా దర్శకుడిగా అనిల్ స్థాయిని పెంచిన సినిమా. 'సరిలేరు' విడుదల సమయంలో అతడికి బాబు పుట్టాడు. అందుకని, ఆ అబ్బాయికి సినిమాలో మహేష్ పేరు అజయ్ కలిసి వచ్చేలా 'అజయ్ సూర్యన్ష్' అని పెట్టుకున్నట్టు అనిల్ రావిపూడి తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమనీ, మహేష్ ఇచ్చిన అవకాశంతోనే 'సరిలేరు నీకెవ్వరు' చేశాననీ, ఆ సినిమాతో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్లాననీ అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3' స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాననీ అన్నారు.
'ఎఫ్ 3'లో మరో 'ఎఫ్' అన్నది 'మోర్ ఫన్' అన్నదానికి సంకేతం అని అనిల్ రావిపూడి చెప్పారు. ఈ సినిమాలో మూడో హీరో విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికి మరో హీరోకి సినిమాలో చోటు లేదని చెప్పారు. అదే సమయంలో సెకండాఫ్ లో ఏమైనా ఛాన్స్ ఉంటే ఆలోచిస్తానని అన్నారు. ఆ విషయంలో చివరి నిమిషం వరకూ తనకూ ఉత్కంఠే అని అనిల్ అన్నారు.
![]() |
![]() |