![]() |
![]() |
.jpg)
మనం అభిమానించే, ఆరాధించే సినిమా తారల్లో ఎక్కువ మంది పెట్ లవర్సే. సూపర్ స్టార్స్ నుంచి చిన్న చిన్న స్టార్స్ దాకా చాలా మంది ఇళ్లల్లో పెంపుడు జంతువులు, పక్షులు మనకు కనిపిస్తాయి. అంటే సోషల్ మీడియా ద్వారా తమ పెట్స్‌ను వాళ్లే మనకు పరిచయం చేస్తుంటారు. ఇవి లాక్‌డౌన్ డేస్ కాబట్టి, స్టార్స్ అందరూ ఇళ్లకే అతుక్కుపోయారు కాబట్టి ఇప్పుడు మరింత ఎక్కువగా తమ పెట్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ, వాటితో గడుపుతున్న ఫొటోలనో, వీడియోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు సినీ స్టార్లు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఫిమేల్ స్టార్స్‌లో ఎవరెవరికి ఏ రకం పెట్స్ ఉన్నాయో, వాటితో వాళ్లు ఎలా గడుపుతున్నారో ఓ లుక్కేద్దామా...
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సమంత యాక్టివ్‌గా లేదు కానీ, లాక్‌డౌన్ డేస్‌ని ఆమె తన హబ్బీ నాగచైతన్యతో పాటు తన పెట్ డాగ్‌తోనూ ఆనందంగా గడుపుతోందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. కారణం.. ఆమె పెట్ లవర్ అనే విషయం అందరికీ తెలిసిందే. తన పెట్ 'హాష్'కు పోయిన నవంబర్‌లో గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా చేసింది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే క్వారంటైన్ డేస్‌లో తన పెట్ డాగ్ 'బ్రూనో'తో టైమ్ పాస్ చేస్తోంది. దాని గురించి ఆమె శ్రద్ధ తీసుకుంటుందంటే, గత దీపావళికి సౌండ్ ఎక్కువగా ఉండే క్రాకర్స్ వల్ల బ్రూనో భయపడుతుందనే ఉద్దేశంతో ఇంటి డోర్లు, విండోలు గట్టిగా బిగించేసింది.

రకుల్ ప్రీత్‌ది కూడా సేమ్ కేస్. పెట్ లవర్ అయిన ఆమె కూడా దీపావళికి చెవులకు చిల్లులు పడేలా సౌండ్ చేసే క్రాకర్స్ నుంచి పెట్స్‌ను కాపాడుకుందామని పిలుపు ఇచ్చింది. ఇప్పుడు క్యూట్‌గా ఉండే తన బొచ్చుకుక్క 'క్యాండీ'ని ఆడిస్తూ కాలక్షేపం చేస్తోంది.

దేవసేన అనుష్కా శెట్టి కేవలం పెట్ లవర్ మాత్రమే కాదు, వాటి రక్షణ కోసం పనిచేసే కార్యకర్త కూడా. ప్రస్తుతం లాక్‌డౌన్ డేస్‌ను తన పెట్‌తో గడుపుతోంది అనుష్క.
బాహుబలి అవంతిక.. తమన్నాకు తన పెట్ 'పెబుల్స్' అంటే పిచ్చి ప్రేమ. ఏడాదిన్నర క్రితం దాని కోసమని వెజిటేరియన్‌గా మారిపోయింది తమ్ము.

జంతు ప్రేమికురాలైన త్రిష.. పెటా, బ్లూ క్రాస్ వంటి పెట్ ఆర్గనైజేన్స్ తరపున చురుకైన కార్యకర్త. ఇంట్లో తనకో పెట్ ఉన్నప్పటికీ అన్ని జంతువుల్నీ తన పెంపుడు కుక్కలాగే ప్రేమగా చూస్తుంది.
'క్రాక్' మూవీతో చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లోకి రాబోతున్న శ్రుతి హాసన్ లాక్‌డౌన్ డేస్‌ను తన పెంపుడు పిల్లి 'క్లారా'తో గడుపుతోంది. క్లారా తరహాలో సోషల్ డిస్టాన్స్‌ను పాటిస్తూ, పరిశుభ్రంగా ఉండమని ఆమె చెబుతోంది.
'ఆర్ఎక్స్ 100' గాళ్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో రెండు పెట్ డాగ్స్ ఉన్నాయి. క్వారంటైన్ డేస్‌ను 'బన్నీ' అండ్ 'క్యాండీ'తో గడిపేస్తున్నానని వాటిని పరిచయం చేసింది పాయల్.

ప్రస్తుతం నటనకు కామా పెట్టి, ప్రొడ్యూసర్ బాధ్యతల్ని ఎంజాయ్ చేస్తోన్న అందాల ఛార్మి ఇంట్లో చాలానే పెట్స్ ఉన్నాయి. తనలోని ఒత్తిడిని తొలగించేది తన పెట్సేనని ఆమె గర్వంగా చెప్తుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్స్ వైఫ్ రేణూ దేశాయ్ ఇంట్లో 'ఫీబో' అనే బ్యూటిఫుల్ క్యాట్ ఉంది. లాక్‌డౌన్‌తో అందరూ ఇంట్లో ఉండి, తలుపులు బిడాయించేసరికి, బయటకు వెళ్తానని అది మారాం చేస్తుంటే, వెళ్లకూడదని రేణు దానిని బుజ్జగిస్తున్నారు. రేణు ఎంతటి యానిమల్ లవర్ అంటే 18 ఏళ్ల క్రితం రోమ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఓ బుజ్జి ఆడ సింహం పిల్లను ఎత్తుకున్నారు. దాని పేరేంటని యజమానిని అడిగితే, ఆయన మీ పేరేంటని రేణును తిరిగి ప్రశ్నించాడు. ఆమె తన పేరు చెప్పగానే, అయితే ఇప్పట్నుంచీ దీని పేరు 'రేణు' అని ఆయన చెప్పాడు. ఆ జ్ఞాపకాల తాలూకు ఫొటోలను కూడా రేణు షేర్ చేసుకున్నారు.
మన రాజోలమ్మాయి అంజలి మంచి పెట్ లవరండోయ్. ఈమధ్యే 'పోలో' అనే బుజ్జి బొచ్చుకుక్క పిల్ల ఆమె కుటుంబంలో వచ్చి చేరింది. ఇప్పుడు అంజలి లోకమంతా పోలోనే.
క్యూట్ గాళ్ అనుపమా పరమేశ్వరన్ ఇంట్లో ఒకటి, రెండు కాదు నాలుగు పెట్స్ ఉన్నాయి. వాటిలో మూడు డాగ్స్ అయితే ఒకటి క్యాట్. ఆ నాలుగింటినీ సోషల్ మీడియాలో పరిచయం చేసి, వాటిలో అన్నింటికంటే నాటీ ఏదో ఊహించమంటోంది అనుపమ.
మన 'అందాల రాక్షసి' లావణ్యా త్రిపాఠీ ప్రస్తుతం ఇంట్లో తన పెట్ డాగ్ 'బ్రూనీ'తో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తోంది. బ్రూనీ ప్రేమను తట్టుకోవడం కష్టమనేది ఆమె మాట.
అఖిల్ 'హలో' మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్ మంచి పెట్ లవర్. మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక క్యూట్ డాగ్‌తో ఆడుకుంటూ ప్రెజెంట్ టైమ్ గడిపేస్తోంది.
'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో తన వంపుసొంపుల ప్రదర్శనతో అలరించిన నిధి అగర్వాల్ ఎంతటి పెట్ లవర్ అంటే కుక్కల్ని కొనకుండా వీధి కుక్కల్ని దత్తత తీసుకోమని కోరుతోంది.. అలాగే మన ఇళ్లల్లో ఉన్న పెట్స్‌ను కొంతమంది వైరస్ సోకుతుందనే భయంతో బయట వదిలేస్తున్నారనీ, దయచేసి అలాంటి పనులు చేయవద్దనీ కోరుతోంది.
'సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్ దగ్గర 'షైలో' అనే బ్రౌన్ పెట్ ఉంది. ఈ నెల మొదట్లోనే దాని బర్త్‌డేని జరిపింది శ్రద్ధ. ఆమె ఫ్యాన్స్ కూడా దానికి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు.
పొడుగుకాళ్ల సుందరి రాయ్ లక్ష్మీ అలియాస్ లక్ష్మీ రాయ్ 'టిఫానీ' అనే క్యూట్ వైట్ డాగ్‌ను ముద్దు చేస్తూ, దానితో కబుర్లు చెబుతూ గడుపుతోంది.
గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌లోని మరో యాంగిల్ పెట్ లవ్. ఎప్పుడూ టీవీ షోస్‌తో యమ బిజీగా ఉండే ఆమె.. ప్రస్తుతం క్వారంటైన్ డేస్‌లో తన ఇంట్లోని చిలకలతో హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేస్తోంది.
'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్‌గా మారిన చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్‌కు జంతు ప్రేమ ఎక్కువే. ఆమె 'మ్యాగీ' అనే పొట్టి కుక్కతో కాలక్షేపం చేస్తూ దానికి బోలెడన్ని కబుర్లు చెబుతోంది.
తెలుగులో 'లోఫర్' మూవీలో హీరోయిన్‌గా నటించి, ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన దిశా పటానీ ఇంట్లో 'బెల్లా', 'గోకు' అనే డాగ్స్, 'కీటీ' అనే వైట్ క్యాట్ ఉన్నాయి. వీటితో లాక్‌డౌన్ డేస్‌లో టైమ్‌పాస్ చేస్తున్నానని చెప్తోంది దిశా.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎగిరిపోయి, అక్కడ కూడా తన హవా చూపిస్తోన్న ప్రియాంకా చోప్రా ఆమధ్య ఇంటికి తనతో పాటు 'జినో' అనే జర్మన్ డాగ్‌నూ తీసుకుపోయి భర్త నిక్ జోనాస్‌ను సర్‌ప్రైజ్ చేసేసింది. ఇప్పుడు జినోతో ఆ ఇద్దరికీ మంచి టైమ్‌పాస్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేశ్‌తో '1.. నేనొక్కడినే' మూవీతోటే సినీ తెరంగేట్రం చేసిన కృతి సనన్ ఇవాళ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరనే విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో తన కుటుంబ సభ్యులతో పాటు 'డిస్కో', 'ఫోబీ' అనే రెండు పెట్ డాగ్స్ కూడా తనకు తోడుగా ఉంటున్నాయంటోంది కృతి.
'ఆర్ఆర్ఆర్' మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మంచి పెట్ లవర్. ఆమె ఇంట్లో డాగ్స్‌తో పాటు మిల్క్‌వైట్ క్యాట్ కూడా ఉంది. ఇప్పుడు వాటితోటే టైమ్ గడుపుతోంది ఆలియా.
అలాగే క్యాథరిన్ ట్రెసా, నివేదా పేతురాజ్, తేజస్వి మదివాడ, ప్రణీత సుభాష్, రష్మీ గౌతమ్, నికిషా పటేల్, రాధికా ఆప్టే, ప్రియా ఆనంద్, స్నేహా ఉల్లాల్, ప్రగ్యా జైస్వాల్, అనుష్కా శర్మ, అక్షరా హాసన్, సారా అలీఖాన్, అనన్యా పాండే, బిపాషా బసు, సింగర్ శ్రేయా ఘోషల్ వంటి అనేక మంది సినిమా సెలబ్రిటీలు లాక్‌డౌన్ సందర్భంగా తమకు లభించిన తీరిక సమయాన్ని తమ పెంపుడు జంతువులను ఆడించుకుంటూ గడిపేస్తున్నారు.
![]() |
![]() |