![]() |
![]() |

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగునాట ఘనవిజయం సాధించిన ఛత్రపతి రీమేక్ ద్వారా ఈ యంగ్ హీరో హిందీ చిత్ర సీమ బాట పడుతున్నారు. బాలీవుడ్ అభిరుచికి తగ్గట్టుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ రీమేక్ స్క్రిప్ట్ కి మార్పు చేర్పులు చేస్తున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా కోసం సుజీత్, ప్రభుదేవా, లింగు స్వామి వంటి దక్షిణాది దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరు ఫైనల్ అవుతారో అన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.
కాగా, ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నటించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరిగాయని బజ్. మరి.. సాయి, సారా జోడీ ఏ స్థాయిలో రంజింపజేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |