![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' రెండో భాగంగా రానున్న 'పుష్ప: ది రూల్'లో నటిస్తున్నాడు. దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. బన్నీ ఇప్పుటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒకటి, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు.. బన్నీ మరో చిత్రం చేసే అవకాశముందని.. ఆ ప్రాజెక్ట్ కోసం బోయపాటి శ్రీను, అట్లీ, సురేందర్ రెడ్డి వంటి దర్శకులు రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా బన్నీ లైనప్ పై క్లారిటీ వచ్చిందని అంటున్నారు.
'పుష్ప-2' తర్వాత అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్నాడట. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి సినిమాలు వరుసగా ఉంటాయట. బన్నీ-అట్లీ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పుడది కన్ఫర్మ్ అయిందని, త్వరలోనే ప్రకటన కూడా రానుందని వినికిడి. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ కోసం చాలా సమయం పట్టనుంది. అందుకే ఈ గ్యాప్ లో అట్లీ మూవీ పూర్తి చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. అలాగే సందీప్ రెడ్డి చేతిలో కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ రెండు పూర్తయ్యాక బన్నీ-సందీప్ సినిమా సెట్స్ పైకే వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
మొత్తానికి బన్నీ లైనప్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇప్పుటికే 'పుష్ప-2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చేయబోయే సినిమాల దర్శకులు టాప్ ఫామ్ లో ఉన్నారు. 'జవాన్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తో అట్లీ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో ఇప్పుటికే హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరు నాలుగో హిట్ కి రెడీ అవుతున్నారు. సందీప్ రెడ్డి సైతం 'యానిమల్'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించాడు.
![]() |
![]() |