![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. రామానాయుడు గారు చిరంజీవిని చిన్నబ్బాయి అని ప్రేమగా పిలిచేవారు.అలాగే వెంకటేష్, చిరంజీవి చాలా స్నేహా భావంతో ఉంటారు.వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తు రామ్ చరణ్ రానాలు కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా వుంటూ నేటికీ తమ స్నేహ బంధాన్ని అలాగే కొనసాగిస్తు వస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే తాజాగా చిరంజీవి రానా లకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చిరంజీవి 156 వ చిత్రం ఈ మధ్యనే అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో మొదట విలన్ గా రానా నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రానా నటించడం లేదు. రానాని ఉన్న కాల్ షీట్ల సమస్య వల్ల రానా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈ వార్తలకి బలం చేకూరేలా హిందీ నటుడు కునల్ కపూర్ తో కొన్ని సన్నివేశాలని కూడా మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. కునల్ కపూర్ ఇటీవల చాలా సినిమాల్లో విలన్ గా నటిస్తు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మరి రానా నిజంగానే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడా లేక రానా కూడా చేస్తున్నాడా అనే విషయం మరికొన్ని రోజుల్లో అధికారకంగా తెలుస్తుంది.
.webp)
చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ పిక్చర్ లా నిలబడిపోయేలా యు వి క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ లు అత్యంత భారీ వ్యయంతో మెగా 156 ని నిర్మిస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన నలుగురు హీరోయిన్లు చేస్తున్నారు. వాళ్ళ వివరాలు అధికారకంగా త్వరలోనే వెల్లడి అవుతాయి.ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ని అనుకుంటున్నారు.
![]() |
![]() |