![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ తో శ్రీమన్నారాయణ అనే ఒక మంచి మెసేజ్ తో కూడిన సినిమాని అందించిన దర్శకుడు రవి చావలి. జగపతి బాబుతో ఆయన తెరకెక్కించిన సామాన్యుడు సినిమాకి గాను నంది అవార్డు ని సైతం అందుకున్నాడు. ఇప్పుడు ఆయన నుంచి బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అనే ఒక వైవిధ్యమైన సినిమా రానుంది.ట్రైలర్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఆ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ మూవీ లవర్స్ కి మంచి కిక్ ని ఇస్తుంది.
బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ మూవీలో శాసనసభ సినిమాలో హీరోగా నటించిన ఇంద్రసేన్ అండ్ మ్యాడ్ మూవీ ఫేమ్ సంతోష్ హీరోలుగా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా చేస్తున్నారు. దర్శకుడు రవి చావలి ఈ మూవీ ఒక విన్నూతనమైన కాన్సెప్ట్ తో ఆద్యంతం చాలా ఎంటర్ టైన్మెంట్ గా ఉండేలా తీర్చిదిద్దాడు. ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటి మెర్లిన్ ఫిలిప్, తమిళ నటుడు తారక్, సత్య ప్రకాష్, శుభలేఖ సుధాకర్,దువ్వాసి మోహన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ కి ఘటికాచలం మాటలని అందించగా బిగ్ బాస్ ఫేమ్ బోలె షావలి సంగీతాన్ని అందించాడు. కషు క్రియేషన్స్ పతాకంపై రమేష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29 న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక టెక్సాస్ ,అండమాన్ లో కూడా విడుదల కాబోతుంది.
![]() |
![]() |