![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబుకి లుంగీ సెంటిమెంట్ గా మారిందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆయన లుంగీ కట్టి కనిపించిన సినిమాలన్నీ విజయం సాధించాయి. ఇప్పుడదే బాటలో 'గుంటూరు కారం' కూడా పయనిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
సాంగ్ లోనో, సీన్ లోనో లుంగీ కట్టుతో మహేష్ దర్శనమిస్తే చాలు.. సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఉంది. 'మురారి', 'పోకిరి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాల్లో మహేష్ లుంగీ ధరించగా.. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 'గుంటూరు కారం' కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. గత సినిమాల్లో సాంగ్ లోనో, సీన్ లోనో లుంగీతో కనిపించిన మహేష్.. గుంటూరు కారంలో మాత్రం పలు సన్నివేశాల్లో కనిపించనున్నాడని ఇప్పటిదాకా విడుదలైన స్టిల్స్ ని బట్టి అర్థమవుతోంది. ఈ లెక్కన గుంటూరు కారం ఆ సినిమాలని మించిన హిట్ అవుతుందేమో చూడాలి.

![]() |
![]() |