![]() |
![]() |

హాస్య కథానాయకుడు `అల్లరి` నరేశ్ ఇప్పటివరకు 57 సినిమాల్లో నటించారు. సక్సెస్ రేట్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నా.. నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రాలు మాత్రం వేళ్ళ మీదే లెక్క పెట్టొచ్చు. `ప్రాణం`, `నేను`, `గమ్యం`, `మహర్షి`.. ఇప్పుడు `నాంది`.. ఇలా అతి తక్కువ సినిమాలే నరేశ్ లోని నటుణ్ణి కొత్తగా ఆవిష్కరించాయి. వీటిలో `గమ్యం`లోని గాలి శీను పాత్ర, తాజాగా విడుదలైన `నాంది`లోని సూర్య ప్రకాశ్ పాత్ర.. నరేశ్ కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నాటి `గమ్యం`గానీ.. నేటి `నాంది`గానీ ఫిబ్రవరి నెలలోనే జనం ముందుకు రావడం విశేషం. 2008 ఫిబ్రవరి 29న `గమ్యం` చిత్రం విడుదలైతే.. పదమూడేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు అదే ఫిబ్రవరిలో `నాంది` రిలీజైంది. మొత్తమ్మీద.. నరేశ్ కి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రెండు సినిమాలు కూడా ఫిబ్రవరి నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావడం చూస్తే.. ఈ నెల అల్లరోడికి వెరీ వెరీ స్పెషల్ అనే అనిపిస్తోంది. మరి.. భవిష్యత్ లోనూ నరేశ్ కి ఫిబ్రవరి మాసం యాక్టర్ గా మరింత గుర్తింపు తీసుకువస్తుందేమో చూడాలి.
![]() |
![]() |