![]() |
![]() |

నితిన్ హీరోగా, చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని భవ్య క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. రీరికార్డింగ్ అయ్యాక ఈ సినిమా చూసి తానే షాకైపోయానని నితిన్ అన్నాడు. అలాగే ఈ సినిమాలోని కీలకమైన పాయింట్‌ను అతను రివీల్ చేశాడు.
చెక్ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న నితిన్, "నా కెరీర్‌లోనే 'చెక్' అనేది మోస్ట్ డ్రైనింగ్ సినిమా. ఈ సినిమా చేసేటప్పుడు డ్రైన్ అయిపోయేవాడ్ని. నా రోల్ అలాంటిది. ఫస్ట్ సీన్‌లోనే ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీగా కనిపిస్తాను. సినిమా అంతా జైల్లోనే ఉంటాను. సెటప్ అంతా చాలా రగ్‌డ్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది. ఆ పాత్రలో ఉన్నప్పుడు నాకు ఉరిశిక్ష పడింది. ఆ పాత్రలో ఉన్నప్పుడు అలా యాక్టింగ్ చెయ్యాలి. అందువల్ల అప్పుడప్పుడు డిప్రెస్ అయ్యేవాడ్ని. ఆ క్యారెక్టర్ కోసం ఫిజికల్‌గా కంటే ఎమోషనల్‌గా ఎక్కువ కష్టపడ్డాను. ఇంటికెళ్లినప్పుడు ఆ మూడ్ స్వింగ్స్ అలాగే ఉండేవి." అంటూ చెప్పాడు.
మొన్న మొత్తం సినిమా చూశానని అతను తెలిపాడు. "ఐ వాజ్ షాక్డ్. నేను పడ్డ కష్టానికి, మా డైరెక్టర్ నన్ను చూపించిన విధానానికి ఫలితం కనిపించింది. నాతో డైరెక్టర్ బాగా చేయించారు. ఈ మధ్య వచ్చిన నా సినిమాలన్నీ ఒకెత్తయితే, ఈ సినిమా మరో ఎత్తు. ఒక డిఫరెంట్ నితిన్‌ను మీరు చూస్తారు. సినిమాలో ఒకే పాట ఉంది. ఆడియెన్స్‌కు చెక్ అనే సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం వస్తున్న సినిమాల్లో చెక్ అనేది కచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమా అని చెప్తాను." అని చెప్పుకొచ్చాడు నితిన్.
![]() |
![]() |