![]() |
![]() |

నవ యువ సామ్రాట్ అఖిల్(Akhil)సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న సాలిడ్ కమర్షియల్ సక్సెస్ 'లెనిన్' (Lenin)తో అందుకున్న విషయం తెలిసిందే. అందుకోవడమే కాదు వారం తిరిగే లోపే వంద కోట్ల క్లబ్ లో చేరుకోబోతుండటంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. భారతి మిట్ట శ్రీరామపురం అనే గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథలో అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్‌కి థియేటర్లలో ఒకటే ఈలలు, గోలలు. ఈ భారీ విజయంతో అఖిల్ అక్కినేని తదుపరి చిత్రాలపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
అఖిల్ తన మొదటి చిత్రం నుంచి ఊర మాస్ సబ్జెట్ తో రాలేదు. కానీ లెనిన్ తో ఆ విధంగా వచ్చి సూపర్ డూపర్ హిట్ ని అందుకోవడంతో పాటు తెలుగు సినిమాకి ఒక కొత్త మాస్ హీరో దొరికాడని చెప్పినట్లయింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఇదే తరహా మాస్ ఫార్ములా నమ్ముకోబోతున్నారా అనే ఆసక్తికరమైన చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో నడుస్తోంది. అఖిల్ తన కెరీర్ ఆరంభం నుండి లవ్ స్టోరీలు, క్లాస్ క్లాసిక్ జోనర్లపై దృష్టి పెట్టారు. అయితే 'లెనిన్' ఇచ్చిన మాస్ సక్సెస్ ఆయన రూట్ మార్చేలా చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ (Akhil 7) కోసం కూడా ఒక భారీ మాస్ యాక్షన్ సబ్జెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని టాక్. దీనితో పాటు, అక్కినేని అభిమానులకు మరో భారీ గుడ్ న్యూస్ కూడా వినబడుతోంది. గతంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన 'మనం' చిత్రం టాలీవుడ్‌లో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు అదే తరహాలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున, నాగచైతన్య, మరియు అఖిల్ ముగ్గురూ కలిసి ఒక క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు బిగ్ ప్లాన్ సిద్ధమవుతోందట. 'లెనిన్' ఘనవిజయంతో వచ్చిన ఊపుతో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పనులు మరింత వేగవంతం అయ్యేలా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అఖిల్ నుంచి మరిన్ని పవర్‌ఫుల్ మాస్ సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also read: Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతి హాసన్.. కమల్ హాసన్ రాకపోవడానికి కారణం ఇదేనా!
![]() |
![]() |