![]() |
![]() |

తనకు కలిసొచ్చిన దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా మూవీస్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తనకు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో 'ఆర్ ఆర్ ఆర్' చేస్తున్న తారక్.. ఆపై 'జనతా గ్యారేజ్' వంటి సెన్సేషనల్ మూవీ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివతో 'ఎన్టీఆర్ 30' కోసం జట్టుకడుతున్నారు. వీటిలో చిత్రీకరణ తుది దశకు చేరుకున్న 'ఆర్ ఆర్ ఆర్' విజయదశమి కానుకగా అక్టోబర్ 13న విడుదలకు సిద్దమవుతోంది.
కాగా, 'ఎన్టీఆర్ 30'ని పట్టాలెక్కించడానికి కూడా దసరానే ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారట. అక్టోబర్ రెండోవారంలో ప్రారంభం కానున్న ఈ సినిమాని చకచకా పూర్తిచేసి.. మొదట అనుకున్నట్లుగా వేసవి కానుకగా ఏప్రిల్ 29న థియేటర్స్ లో విడుదల చేయడానికి కొరటాల అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. మొత్తమ్మీద.. ఏడు నెలల్లోపే ఎన్టీఆర్ రెండు భారీ బడ్జెట్ మూవీ చిత్రాలతో సందడి చేయబోతున్నారట. త్వరలోనే 'ఎన్టీఆర్ 30'కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇదిలా ఉంటే.. కొరటాల శివ తాజా చిత్రం 'ఆచార్య' చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఆగస్టులో ఈ సోషల్ డ్రామా జనం ముందుకు వచ్చే అవకాశముందంటున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తుండగా.. 'సిద్ధ'గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |