![]() |
![]() |

సోమవారం కుమార్తె ఈషా డియోల్ బర్త్‌డే సందర్భంగా డ్రీమ్ గాళ్ హేమమాలిని తన ఇంట్లో ఒక ప్రత్యేక హవన్ (పూజా కార్యక్రమం) నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. "ఇవాళ ఈషా బర్త్‌డే. ఆమె ఎప్పుడూ సంతోషంగా, అందరి ప్రేమానురాగాలు పొందుతూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఇప్పుడు కూడా మా ఇంట్లో ఒక చిన్న హవన్ ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్‌లో మా ఫ్యామిలీ పురోహితుని నిర్దేశకత్వంలో ఈషా పక్కనే కూర్చొని పూజ చేశాను. Love you @Esha_Deol my baby.” అని ఆమె రాసుకొచ్చారు.

అమ్మ సందేశానికి ఈషా స్పందించింది. "లవ్ యు అమ్మా! నువ్వు చాలా అందంగా హవన్ నిర్వహించావు! థాంక్యూ లవ్ యూ" అని ట్వీట్ చేసింది. అంతకుముందు ఉదయం 39వ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్ట్‌ను పెట్టింది ఈషా. "ప్రేమతో నిండిన హృదయం, కృతజ్ఞతతో నిండిన ఆత్మ.. అది నేను! ఇంకో ఏడాది వివేకవంతురాలిగా, శక్తిమంతురాలిగా, బలమైనదానిగా ఈరోజు ఎదిగాను. నా బర్త్‌డేకి, ప్రతి రోజూ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు, ప్రేమ అందించే అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా" అని ఆమె రాసుకొచ్చింది.
లాక్‌డౌన్ పీరియడ్‌లో తన తల్లి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తరచూ తన ఇంటి నుంచి అమ్మ దగ్గరకు వెళ్లొస్తూ వస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈషా. "పోలీసు మాదిరిగా ఆమె మీద గట్టిగా ఓ కన్నేసి ఉంచా" అని చెప్పి నవ్వేసింది.

![]() |
![]() |