![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టన్నింగ్ బ్యూటీ కృతి సనన్ మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`లో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. కాగా, 2022 ఆగస్టు 11న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం వెండితెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ గత చిత్రం `సాహో`(2019)లో కథానాయికగా నటించిన శ్రద్ధా కపూర్.. కృతి సనన్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటైన `లూకా చుప్పీ`(2019)లో కథానాయకుడిగా నటించిన కార్తిక్ ఆర్యన్ ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కోసం జట్టుకట్టనున్నారు. `సత్యనారాయణ్ కీ కథ` పేరుతో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ప్రొడ్యూస్ చేయనున్న చిత్రంలో కార్తిక్, శ్రద్ధ జోడీకట్టనున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ఇద్దరు కూడా ఈ సినిమా కోసమే తొలిసారిగా కలిసి నటించనున్నారు. అంతేకాదు.. ఈ ఇద్దరి జంటే సినిమాకి ప్రధాన ఆకర్షణ అని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. 2022లో ఈ సరికొత్త ప్రేమకథా చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.
మరి.. ప్రభాస్ హీరోయిన్ తో కృతి సనన్ హీరో చేయనున్న రొమాన్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |