![]() |
![]() |
.webp)
ఇటీవల 'పుష్ప ది రైజ్'లో 'ఊ అంటావా మావ' అంటూ స్పెషల్ సాంగ్ లో చిందేసి ఆకట్టుకున్న సమంత.. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి ఆమె నటించిన 'కాతువాకుల రెండు కాదల్' సినిమా తమిళ్ తో పాటు ఏప్రిల్ 28 న విడుదల కానుంది. ఇక తాజాగా సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'యశోద' రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న యశోద సినిమాతో హరి-హరీష్ అనే యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఆగష్టు 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

సమంత 'శాకుంతలం' అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యశోద కంటే ముందే ప్రారంభమై షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫీమేల్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా మూవీలతో వస్తున్న సమంత ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
![]() |
![]() |