![]() |
![]() |

మాస్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ తరం కథానాయకుల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. అలా చరణ్ నటించిన మాస్ మసాలా సినిమాల్లో `రచ్చ` ఒకటి. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా.. అజ్మల్ అమీర్, ముకేశ్ రిషి, దేవ్ గిల్, కోట శ్రీనివాసరావు, నాజర్, బ్రహ్మానందం, అలీ, దీక్షా పంత్, పరుచూరి వెంకటేశ్వర రావు, జయప్రకాశ్ రెడ్డి, గీత, వేణు మాధవ్, శ్రీనివాస రెడ్డి, తాగుబోతు రమేశ్, ఎమ్మెస్ నారాయణ, సుధ, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణ భగవాన్, ఝాన్సీ, ఛత్రపతి శేఖర్, ఉత్తేజ్, గీతా సింగ్, శ్రియా శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఆర్. పార్తిపన్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాలో లీసా హెడేన్ టైటిల్ సాంగ్ లో గ్లామర్ తో కనువిందు చేసింది.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం `రచ్చ`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``వానా వానా వెల్లువాయె`` (`గ్యాంగ్ లీడర్`లోని పాటకి రీమిక్స్), ``ఢిల్లకు ఢిల్లకు``, ``ఒక పాదం``, ``సింగరేణి ఉంది``, ``రచ్చ`` (టైటిల్ సాంగ్).. ఇలా ఇందులోని పాటలన్నీ మాస్ ని మెప్పించాయి. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్. బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించిన `రచ్చ`.. 2012 ఏప్రిల్ 5న విడుదలై వసూళ్ళ వర్షం కురిపించింది. నేటితో ఈ మాస్ ఎంటర్టైనర్ 10 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |