![]() |
![]() |

ఆన్ స్క్రీన్ లోనూ, ఆఫ్ స్క్రీన్ లోనూ బెస్ట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడిపోయి ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మాజీ భర్త చైతన్య, మాజీ మరిది అఖిల్ సినిమాలకు పోటీగా తన సినిమాని రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వార్ కి సమంత దిగడం ఆసక్తికరంగా మారింది.
సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'యశోద' ఆగష్టు 12 న విడుదల అవుతున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. అయితే అదే సమయంలో చైతన్య, అఖిల్ సినిమాలు రానున్నాయి. ఆ సినిమాల రిలీజ్ డేట్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో చైతన్య బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 11 న విడుదల కానుంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్' ఆగష్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడు ఆగష్టు 12 న సమంత నటించిన యశోద విడుదల అని ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. ముందు రోజు మాజీ భర్త సినిమా, విడుదల రోజు మాజీ మరిది సినిమా వస్తున్నాయి. మరి అక్కినేని హీరోలు వర్సెస్ అక్కినేని మాజీ కోడలు మధ్య జరగనున్న ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
![]() |
![]() |