![]() |
![]() |
.webp)
కొద్దిరోజులుగా 'కేజీఎఫ్-3' సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏ అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ మూవీ 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని అందుకుంది. ఇక 'కేజీఎఫ్-2' అయితే 'ఆర్ఆర్ఆర్' రికార్డులను సైతం బ్రేక్ చేసి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఇప్పుడు 'కేజీఎఫ్-3'పై అందరి దృష్టి పడింది. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం రోజుకో మాటతో ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
'కేజీఎఫ్-2' ఎండ్ టైటిల్స్ లో 'కేజీఎఫ్-3' ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో అప్పటినుంచి 'కేజీఎఫ్-3' హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఈ ఏడాదే మొదలవుతుందని ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. 'సలార్' షూటింగ్ పూర్తయ్యాక నవంబర్ నుంచి 'కేజీఎఫ్-3' వర్క్ స్టార్ట్ అవుతుందని, 2024 లో సినిమా విడుదలవుతుందని న్యూస్ రావడంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇంతలోనే మరో ట్విస్ట్ వచ్చింది. కేజీఎఫ్ నిర్మాతల్లో ఒకరైన కార్తీక్ గౌడ ఇప్పట్లో 'కేజీఎఫ్-3' ఉండదని చెప్పి షాకిచ్చారు.
ఈ ఏడాది 'కేజీఎఫ్-3' స్టార్ట్ అవుతుందన్న వార్తల్లో నిజం లేదని కార్తీక్ గౌడ అన్నారు. ప్రస్తుతం హోంబలే సంస్థ చేతిలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయని, ఇప్పుడు తమ దృష్టంతా వాటిపైనే ఉందని తెలిపారు. ఇప్పట్లో 'కేజీఎఫ్-3'ని పట్టాలెక్కించే ఆలోచన లేదని, ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే అధికారికంగా ప్రకటిస్తామని కార్తీక్ చెప్పారు.
![]() |
![]() |