![]() |
![]() |

ఈ శుక్రవారం (మే 6) మూడు ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సందడి చేయనున్నాయి. వాటిలో `జయమ్మ పంచాయితీ` ఒకటి. స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ఈ విలేజ్ డ్రామాతో విజయ్ కుమార్ కాలివరపు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అగ్ర సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కీరవాణి సంగీతమందించిన గత రెండు చిత్రాలు కూడా విజయపథంలో పయనించాయి. ఆ చిత్రాలే.. `పెళ్ళి సందD`, `ఆర్ ఆర్ ఆర్`. రోషన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'పెళ్ళి సందD' గత ఏడాది విజయదశమి కానుకగా విడుదలై మ్యూజికల్ గా మెప్పించడమే కాకుండా నెగటివ్ టాక్ ని అధిగమించి మరీ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఇక ఈ సంవత్సరం మార్చి 25న పాన్ - ఇండియా మూవీగా రిలీజైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ మల్టిస్టారర్ 'ఆర్ ఆర్ ఆర్' అయితే జాతీయ స్థాయిలో వసూళ్ళ వర్షం కురిపించి సంచలనం సృష్టించింది.
మరి.. 'పెళ్ళి సందD', 'ఆర్ ఆర్ ఆర్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత కీరవాణి స్వరకల్పనలో వస్తున్న 'జయమ్మ పంచాయితీ' కూడా అదే బాట పట్టి కీరవాణికి చాలా కాలం తరువాత హ్యాట్రిక్ ని అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |