![]() |
![]() |

ఈ సంక్రాంతికి నాలుగు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. జనవరి 12న 'హనుమాన్', 'గుంటూరు కారం' విడుదల కాగా.. హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకుంది. 'గుంటూరు కారం' మాత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. జనవరి 13న విడుదలైన 'సైంధవ్' కూడా డివైడ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. ఇక ఈరోజు జనవరి 14న విడుదలైన 'నా సామి రంగ' పరవాలేదు అనిపించుకుంది. మొత్తానికి టాక్ పరంగా చూస్తే 'హనుమాన్' కే ఎక్కువ మార్కులు పడ్డాయి.
సంక్రాంతి సీజన్ కావడంతో సినిమాలన్నీ మంచి వసూళ్లే రాబడుతున్నాయి. ముఖ్యంగా 'గుంటూరు కారం' టాక్ తో సంబంధం లేకుండా రెండు రోజుల్లో రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. ఇక 'హనుమాన్' మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది. 'సైంధవ్' ఫస్ట్ డే కలెక్షన్స్ పరవాలేదు అనేలా ఉన్నాయి. 'నా సామి రంగ' మంచి ఓపెనింగ్స్ నే రాబడుతోంది. అయితే ఈ నాలుగు సినిమాల్లో ఆడియన్స్ మొదటి ఛాయిస్ 'హనుమాన్' లేదా 'గుంటూరు కారం' అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరి టాక్ పరంగా పైచేయి సాధించిన 'హనుమాన్'.. వసూళ్ల పరంగా కూడా పైచేయి సాధిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |