![]() |
![]() |

టాక్ తో సంబంధం లేకుండా 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.63 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టినా ఆశ్చర్యం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.38.88 కోట్ల షేర్, రెండో రోజు రూ.8.57 కోట్ల షేర్ రాబట్టిన గుంటూరు కారం.. రెండు రోజుల్లో రూ.47.45 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఏరియాల వారీగా చూస్తే రెండు రోజుల్లో నైజాంలో రూ.20.50 కోట్ల షేర్ , సీడెడ్ లో రూ.4.32 కోట్ల షేర్ , ఆంధ్రాలో రూ.22.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.3.70 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.12 కోట్ల షేర్ కలిపి.. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.63.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రూ.132 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గుంటూరు కారం.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.52.03 కోట్ల షేర్, రెండో రోజు రూ.11.12 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.69 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ మూడు రోజులు సంక్రాంతి సెలవలు కావడంతో మరో రూ.30 కోట్లకు పైగా షేర్ సాధించే అవకాశముంది.
'గుంటూరు కారం' మూవీ 2 రోజుల వసూళ్లు:
నైజాం: రూ.20.50 కోట్ల షేర్
సీడెడ్: రూ.4.32 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.22.63 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.47.45 కోట్ల షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: రూ.3.70 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.12 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల వసూళ్లు: రూ.63.15 కోట్ల షేర్
![]() |
![]() |