![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
'మెగా 156' టైటిల్ ను రేపు(జనవరి 15న) సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి 'విశ్వంభర' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి మూవీ టైటిల్ 'విశ్వంభర'నా? లేక మరేదైనా టైటిలా? అనేది రేపటితో తేలిపోనుంది.
ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

![]() |
![]() |