![]() |
![]() |

తన సంగీతంతో ఎంతోమంది ప్రజలను ఒక ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు, లిరిసిస్ట్ దేవి శ్రీప్రసాద్. అతని మ్యూజిక్ అంటే చాలామందికి ఇష్టం. నీకోసం, దేవి, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మధుడు, ఆర్య , సరిలేరు నీకెవ్వరు, వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో మూవీస్ తన వాయిస్ ని, తన మ్యూజిక్ ని అందించాడు. అలాంటి మ్యూజిక్ కోసం అతను పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటాడు. అలాంటి దేవి శ్రీప్రసాద్, హేమచంద్ర, మంగ్లీ, కార్తీక్ ఇలా చాలామంది కలిసి లండన్ లో ఈ సంక్రాంతికి మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు.
ఇక దేవిశ్రీప్రసాద్ తన వీడియోస్ ని పిక్స్ ని తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసేసరికి ఆడియన్స్, ఫాన్స్ అంతా షాకవుతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఏమిటి ఇలా ఐపోయారు...చాలా స్లిమ్ అయ్యారు. డీఎస్పీ గెటప్ చూసి "ఇది పుష్ప 3 లో నటించడం కోసం రెడీ అవుతున్న గెటప్ అలర్ట్ అని అనుకుంటున్నా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "ఈ గెటప్ లో చూసి రోహిత్ శర్మ అనుకున్నా, సూపర్ లుక్ బ్రదర్, ఈ ఇయర్ అంతా నీదే కావాలి..మంచి మ్యూజిక్ తో ఆడియన్స్ ని అలరించాలి..హీరో మెటీరియల్ అన్నా నువ్వు" అంటూ ఇంకా కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
డీఎస్పీకి గతంలో కమలహాసన్ అమెరికా నుండి హ్యాండ్ మేడ్ బుక్ ని తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ మెమరీని కూడా రీసెంట్ గా ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఎవరికైనా మంచి వాయిస్ ఉంటే వాళ్ళను ఇండస్ట్రీకి పరిచయం కూడా చేస్తారు డీఎస్పీ. అలా కలర్స్ స్వాతిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నాగచైతన్య తమన్నా జంటగా నటించిన 100% లవ్ సినిమాలో ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనే పాటను పాడారట.అప్పట్లో ఈ పాట ఎంతో హిట్ అయింది. ఇలా డీఎస్పీ ఏది చేసిన అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది.
![]() |
![]() |