![]() |
![]() |

కొంతకాలంగా ప్రేమలో ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీళ్ళ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విఘ్నేష్ తమ పెళ్లి తేదీ, వేదిక తదితర విషయాలను పంచుకున్నాడు.
జూన్ 9వ తేదీన తన ప్రేయసి నయనతారను పెళ్లి చేసుకోబోతున్నట్లు విఘ్నేష్ తెలిపాడు. మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో పెళ్లి చేసుకోబోతున్నామని.. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరవుతారని అన్నాడు. మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నామని, కానీ కుటుంబసభ్యులు అందరితో అక్కడికి వెళ్లడం కష్టమని భావించి వేదికను మార్చామని చెప్పాడు. గురువారం పెళ్లి జరిగాక ఫోటోలు షేర్ చేస్తామని విఘ్నేష్ పేర్కొన్నాడు.
కాగా రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి నయన్-విఘ్నేష్ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. దీంతో ఈ వేడుకకు స్టాలిన్ హాజరయ్యే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |