Home

»

Latest News

సుధీర్ బాబు `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్`కి తొమ్మిదేళ్ళు!

Jun 7, 2022 3:59PM

తెలుగునాట హార‌ర్ కామెడీ డ్రామాల‌కు ఊపు తెచ్చిన సినిమాల్లో `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్`కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ప‌రిమిత బ‌డ్జెట్ తో రూపొంది సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రంతోనే.. క‌థానాయ‌కుడు సుధీర్ బాబు త‌న కెరీర్ లో ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చూశారు. సుధీర్ బాబుకి జోడీగా నందితా రాజ్ న‌టించిన ఈ సినిమాలో సప్త‌గిరి, ప్ర‌వీణ్‌, క‌డియాల ప్ర‌వీణ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ జె. ప్ర‌భాక‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మారుతి దాస‌రి, సుద‌ర్శ‌న్ రెడ్డి నిర్మించారు.

జె.బి. (జీవ‌న్ బాబు) సంగీత‌మందించిన ఈ సినిమాలో ``వెన్నెలైనా చీక‌టైనా`` (రీమిక్స్),  ``కొత్త‌గున్న హాయి``, ``ఐ జ‌స్ట్ ల‌వ్ యు బేబి``, ``ప్రేమ‌క‌థా చిత్ర‌మిది``, ``ఓ మై ల‌వ్`` అంటూ మొద‌ల‌య్యే పాట‌ల‌న్నీ రంజింప‌జేశాయి. క‌న్న‌డంలో `చంద్ర‌లేఖ‌` (చిరంజీవి స‌ర్జా - శాన్వి శ్రీవాత్స‌వ‌), త‌మిళంలో `డార్లింగ్` (జీవీ ప్ర‌కాశ్ కుమార్ - నిక్కీ గ‌ల్రాణి) పేర్ల‌తో `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్` రీమేక్ అయింది. 2013 జూన్ 7న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్`.. నేటితో తొమ్మిదేళ్ళు పూర్తిచేసుకుని ప‌దో వ‌సంతంలోకి అడుగుపెడుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com