Home

»

Latest News

31 వ‌సంతాల‌ `చిత్రం భ‌ళారే విచిత్రం`!

Jun 7, 2022 3:24PM

హాస్య ప్ర‌ధాన‌ చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన అల‌నాటి క‌థానాయ‌కుల్లో న‌రేశ్ ఒక‌రు. న‌రేశ్ హీరోగా న‌టించ‌గా.. విశేషంగా ఆక‌ట్టుకున్న కామెడీ డ్రామాల్లో `చిత్రం భ‌ళారే విచిత్రం` ఒక‌టి. క‌థానుసారం ఇందులో `ప్రేమ‌`గా ఆడ‌వేషంలోనూ క‌నిపించి.. భ‌లేగా న‌వ్వులు పంచారు న‌రేశ్. అలాగే, త‌న న‌ట‌న‌కిగానూ `నంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డు`ని సైతం సొంతం చేసుకున్నారు. ఇక ఇదే చిత్రంలో బ్ర‌హ్మానందం హావ‌భావాలు, ``నీ ఎంక‌మ్మ‌`` అనే డైలాగ్ కూడా బాగా పాపుల‌ర్ అయ్యాయి.

న‌రేశ్ కి జోడీగా రాజీవి న‌టించిన ఈ సినిమాలో శుభ‌లేఖ సుధాక‌ర్, తుల‌సి, బిందు ఘోష్, మ‌హ‌ర్షి రాఘ‌వ‌, కోట శ్రీ‌నివాస‌రావు, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, అత్తిలి ల‌క్ష్మి, రావికొండ‌ల రావు, రాధాకుమారి, ప్ర‌దీప్ శ‌క్తి, గిరిబాబు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. మ‌రాఠి చిత్రం `అశి హి బ‌న‌వా బ‌నవి`(1988) ఆధారంగా ద‌ర్శ‌కుడు పి.ఎన్. రామ‌చంద్రారావు తెర‌కెక్కించిన ఈ సినిమాకి తోట‌ప‌ల్లి మ‌ధు సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. అలాగే విద్యాసాగ‌ర్ సంగీతం, వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి సాహిత్య‌మందించారు. శ్రీ సాయిరామ్ ఫిల్మ్స్ ప‌తాకంపై ఆర్వీ విజ‌య కుమార్ నిర్మించిన `చిత్రం భ‌ళారే విచిత్రం`.. 1991 జూన్ 7న విడుద‌లై జ‌న‌నీరాజ‌నాలు అందుకుంది. కాగా, నేటితో ఈ సినిమా 31 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com