![]() |
![]() |

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(vijay sethupathi)నటన చూసిన ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. హీరో కే కాదు విలన్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారనే నిజాన్ని సజీవం చేస్తున్నాడు. హీరోగా,విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు. తాజాగా ఒక హీరోయిన్ గురించి వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా మారాయి.
విజయ్ సేతుపతి అప్ కమింగ్ మూవీ మహారాజ(maharaja)సౌత్ సినీ ప్రేమికులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి (krithi shetty)గురించి తన అభిప్రాయాన్ని తెలిపాడు. గతంలో నేను నటించిన డిఎస్ పి మూవీలో హీరోయిన్ గా కృతి ని తీసుకుందామని అనుకున్నారు. అప్పుడు నేను వారితో ఒక మాట చెప్పా. హీరోయిన్ గా కృతి ఉంటే నేను చెయ్యనని చెప్పాను. అందుకు కారణం కూడా ఉంది. నేను కృతి కలిసి ఉప్పెన లో తండ్రి కూతుళ్లుగా చేసాం. కుమార్తెగా చేసిన అమ్మాయితో రొమాన్స్ చెయ్యలేను. అందుకే నో చెప్పానని చెప్పాడు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన చాలా మంది సేతుపతిని మెచ్చుకుంటున్నారు.

అలాగే ఉప్పెన షూటింగ్ టైం లో జరిగిన ఒక సంఘటన ని కూడా చెప్పాడు. క్లైమాక్స్ సీన్ లో నాతో డైలాగ్స్ చెప్తున్నాడు కృతి కంగారు పడింది. అప్పుడు నేను ఆమెతో నాకు నీ వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. కంగారు పడద్దని చెప్పాననే విషయాన్నీ కూడా తెలిపాడు. ఇక ఉప్పెన (uppena)లో తండ్రి కూతుళ్లుగా ఆ ఇద్దరి పెర్ఫామ్ సూపర్ గా ఉంటుంది.
![]() |
![]() |