![]() |
![]() |
ఈమధ్యకాలంలో బెంగళూరు రేవ్ పార్టీ అంశం సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది. ఎందుకంటే నటి హేమ ఈ కేసులో నిందితురాలిగా ఉండడం, ఎన్నో పరిణామాల తర్వాత ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచడం జరిగిపోయాయి. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది కోర్టు.
ఈ పరిణామాలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది. అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చెయ్యాలని ‘మా’ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినీ పరిశ్రమకు అప్రతిష్ట తీసుకొచ్చిన ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే హేమను సస్పెండ్ చేసేందుకు కమిటీ కూడా సిద్ధంగా ఉందని సమాచారం. అయితే ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు శుక్రవారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. హేమ సస్పెన్షన్ విషయాన్ని సభ్యుల ముందు ఉంచగా, ఎక్కువ మంది సభ్యులు ఆమెను సస్పెండ్ చేయడమే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
![]() |
![]() |