![]() |
![]() |
.webp)
టాలీవుడ్ లో కొన్ని కొన్ని కాంబినేషన్స్ గురించి వార్తలు రావడం ఆలస్యం. ఓవర్ నైట్ ఆ కాంబోకి క్రేజ్ ఏర్పడుతుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ మీదకి వస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడుతుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (ram potineni)నెక్స్ట్ మూవీ ఇలాంటి క్రేజ్ నే తీసుకొస్తుంది.
రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీగా ఉన్నాడు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. పైగా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ కావడంతో అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇటీవల వచ్చిన టీజర్ కూడా అదిరిపోవడంతో ఇస్మార్ట్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత రామ్ చెయ్యబోయే కొత్త ప్రాజక్ట్ కి సంబంధించిన న్యూస్ అందరిలో క్యూరియాసిటీ ని కలిగిస్తుంది. మహేష్ బాబు తో కమిట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబోలో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కి దర్శకత్వం వహించింది మహేష్ బాబు నే..ఒక పెళ్లి కానీ అమ్మాయి స్పెరమ్ డోనర్ సహాయంతో తన ఒంటి మీద చెయ్యి కూడా పడకుండా తల్లి కావాలని అనుకుంటుంది. అలాంటి డేరింగ్ సబ్జట్ ని మహేష్ క్లీన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన విధానం పలువురిని ఆకట్టుకుంటుంది. పైగా తెలుగు తెరపై అలాంటి కథ ఎప్పుడు రాలేదు. మరి రామ్ తో ఎలాంటి కథని తెరకెక్కించబోతాడో చూడాలి. ఆ ఇద్దరి కాంబో గురించి త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ఒక బడా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

డబుల్ ఇస్మార్ట్ ఫుల్ మెగా మాస్ మూవీ. యాక్షన్ హై ఓల్టేజ్ లో ఉండబోతుంది. సో రామ్ తన నెక్స్ట్ మూవీని మహేష్ లాంటి దర్శకుడు తో చేస్తే ఆయన కెరీర్ కి హెల్ప్ అవుతుంది. ప్రెజంట్ రామ్ ధ్యాస మొత్తం డబుల్ ఇస్మార్ట్ మీద ఉంది. పూరి జగన్నాధ్(Puri Jagannath)దర్శకత్వం వహిస్తుండగా కావ్య థాపర్(kavya thapar) హీరోయిన్ గా చేస్తుంది. ఎన్నో ఆశలతో చేసిన స్కంద బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రామ్ ఉన్నాడు.
![]() |
![]() |