Home  »  News  »  Kaattaan: మొండెం లేని తల.. విజయ్ సేతుపతికి ఏమైంది?

Updated : Mar 13, 2026

  • విజయ్ సేతుపతి కొత్త వెబ్ సిరీస్ 'కాట్టాన్' 
  • అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మణికందన్ రూరల్ యాక్షన్ థ్రిల్లర్
  • ఓటీటీలో సంచలనానికి సిద్ధం

విభిన్న కథలు, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యాడు తమిళ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా లేదా సిరీస్ వస్తుందంటే.. దానిపై ప్రేక్షకుల దృష్టి ఖచ్చితంగా ఉంటుంది. త్వరలో ఆయన ఓ డిఫరెంట్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ 'ముత్తు అలియాస్ కాట్టాన్'(Muthu Alias Kaattaan). కాకా ముట్టై, కడైసి వివసాయి వంటి అవార్డు విన్నింగ్ సినిమాలతో మంచి పేరు గడించిన దర్శకుడు మణికందన్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కడం విశేషం. 

'కాట్టాన్' సిరీస్ రిలీజ్ డేట్ ని తాజాగా రివీల్ చేశారు. మార్చి 27 నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

రూరల్ యాక్షన్ థ్రిల్లర్ గా 'కాట్టాన్' తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. మొండెం లేని తల దొరకడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. "ఇది నా తల. మీరు నా బాడీని వెతికి పట్టుకోవాలి" అని విజయ్ సేతుపతి పోలీసులకు సవాల్ విసురుతున్నట్లుగా డిఫరెంట్ గా టీజర్ ను కట్ చేశారు. అసలు కాట్టాన్(విజయ్ సేతుపతి) ఎవరు? అతని కథ ఏంటి? అతన్ని ఎవరు హత్య చేశారు? అనే ఆసక్తిని కలిగిస్తూ టీజర్ రూపొందించారు.

మరో రెండు వారాల్లో స్ట్రీమింగ్ కి రానున్న 'కాట్టాన్' సిరీస్.. ఓటీటీలో గట్టిగానే సౌండ్ చేసేలా ఉంది.

Also Read: సాకులు చెప్పొద్దు.. ఫేక్ చేయొద్దు.. మంచు మనోజ్ సంచలనం!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.