Home  »  News  »  Rashmika Mandanna: రష్మికపై జరుగుతున్న అసత్య ప్రచారం ఇదే.. విజయ్ దేవరకొండ స్పందన చూడాలి

Updated : Mar 13, 2026


-రష్మిక పై సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది
-ఆ ప్రచారాన్ని చేస్తుంది ఎవరు 
-ట్వీట్ లో ఏముంది
-స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న రష్మిక  


ఏ తెలుగు చిత్ర పరిశ్రమ అయితే తనకి స్టార్ స్టేటస్ ని కట్టబెట్టిందో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ని పెళ్లి చేసుకొని ఇప్పుడు రష్మిక మందన్న(Rashmika Mandanna)తెలుగింటి కోడలుగా మారింది. దీంతో తన సినీ, వ్యక్తిగత జీవితంపై తెలుగువారి ఫోకస్ ఎక్కువ అయ్యిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో టాప్ చైర్ లో కూర్చుంది. ఆ ట్వీట్ లో ఏముందో చూద్దాం.  

రష్మిక తన ట్వీట్ లో  గత ఎనిమిదేళ్లుగా నాపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు, వేధింపులు కొనసాగుతున్నాయి.కొంతమంది వ్యక్తులు,మీడియా వర్గాలు నేను మాట్లాడిన మాటలని సందర్భం నుంచి వేరుచేసి నేను ఎప్పుడు పలకని విషయాలని తప్పుడు కథనాలుగా ప్రచారం చేస్తున్నారు. వీక్షణలు, రీచ్ కోసం ద్వేషాన్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయడమే వాళ్ళ పని. గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణని సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా రికార్డ్ చేయడమే కాకుండా దానిలో నుండి చిన్న భాగాన్ని కత్తి రించి వైరల్ చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.  ఇలాంటి తప్పుడు ప్రచారం ఇకపై సహించబోను. వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేయడం ఆపాలి. ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని తాను నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. 

also read: UStaad Bhagat singh: ఖుషి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ నే అంట.. లడ్డు అంటున్న నిర్మాత 

ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గురించి ప్రచారం అవుతున్న అసత్య కంటెంట్‌ ని  24 గంటల్లో తొలగించాలి. అలా చేయకపోతే సంబంధిత వ్యక్తులపై పరువునష్టం దావా (డిఫమేషన్ కేసు) వేస్తానని గట్టిగా హెచ్చరించారు.ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఇప్పటివరకు తనకి ప్రేమతో మద్దతు తెలిపిన అభిమానులకి తన ట్వీట్ లో కృతజ్ఞతలు తెలిపారు. రష్మిక ట్వీట్ పై  విజయ్ దేవరకొండ నుంచి ఇంకా స్పందన రాలేదు. మరి అసత్య ప్రచారంపై తను ఎలా స్పందిస్తాడో చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.