Home  »  News  »  Nagarjuna: నాగార్జున అందానికి ఆ జపనీస్ వంటకమే కారణమా! ఎలా బయటకొచ్చింది

Updated : Mar 13, 2026

 


  
-అభిమానుల పోటాపోటీ మెసేజెస్ 
-షోయూలో సుజితోలో ఏముంది
-ఈ విషయాన్నీ ఎవరు బయటపెట్టారు

కింగ్ నాగార్జున(Nagarjuna).. పేరు ముందు కింగ్ అనేది ఊరికే రాలేదంటు విభిన్న కథాంశంతో కూడిన చిత్రాలతో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఎనీ క్యారక్టర్ తీసుకోండి తను కనపడడు. క్యారక్టర్ మాత్రమే కనపడుతుంది. సినిమా బాగు కోసం ఎంత దూరం అయినా, ఏం చేయడానికైనా వెనుకాడడు. కింగ్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం. ప్రస్తుతం తన వందవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అభిమానులకి, ప్రేక్షకులకి మంచి మెమరబుల్ మూవీ ఇవ్వాలనేది నాగ్ పట్టుదల. ఈ మూవీ అప్ డేట్స్ కోసం సెర్చ్ చేస్తున్న అభిమానులకి కింగ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ కంటపడింది. పైగా నాగచైతన్య (Naga Chaintanya) సదరు న్యూస్ సృష్టికర్త కావడంతో కామెంట్స్ చేయడంలో వాళ్లంతా పోటీపడుతున్నారు.

ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాగ చైతన్య 'క్లౌడ్ కిచెన్'(Cloud Kichen)పేరుతో ఫుడ్ రంగంలోకి అడుగుపెట్టాడు. జపనీస్ వంటకాలకి మాత్రం బాగా ఫేమస్. ఈ క్రమంలో జపనీస్ కి చెందిన ఎన్నో కొత్త  రకాల వంటకాల్ని ఆర్డర్ పై కస్టమర్స్ కి పంపిస్తుంటాడు. క్లౌడ్ కిచెన్ గురించి తాజాగా నాగ చైతన్య మాట్లాడుతు ఏ కొత్త రకం డిష్ తయారు చేసినా నేను, శోభిత టెస్ట్ చేసే పంపిస్తాం.  నాన్నకి షోయూలో సుజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి సండే పిలిచి ఈ సారి కొత్తగా పిజ్జాలు ఏం చేసారు. నాకు పంపించు అని అడుగుతుంటారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు అభిమానులతో పాటు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

also read: sona heiden: మగాళ్లతో గడపడం ఫూలిష్ పని.. వాళ్ళు టిష్యూ పేపర్‌తో సమానం

అభిమానులైతే మా బాస్ అందానికి 'షోయూలో సుజితో' పిజ్జాలు కారణమా అనే కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా అవే పిజ్జాలని ఆర్డర్స్ చేసే బిజీలో ఉన్నారు. ఫుడ్ లవర్స్ కూడా  ఈ విషయంలో పోటీ పడే అవకాశం ఉంది. మరి ఈ లెక్కన 'క్లౌడ్ కిచెన్' సర్వర్ క్రాష్ అయ్యే అవకాశం ఉండవచ్చేమో.    

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.