![]() |
![]() |

మహేశ్ హీరోగా పరశురామ్ పేట్ల డైరెక్ట్ చేసిన 'సర్కారువారి పాట' నాలుగో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఆదివారం కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా థియేటర్లలో కనిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.06 కోట్ల షేర్‌ను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో నాలుగు రోజుల్లో 'సర్కారువారి పాట' వసూళ్లు వరల్డ్ వైడ్‌గా రూ. 85.87 కోట్ల (షేర్)కు చేరుకున్నాయి. గ్రాస్ విషయానికొస్తే రూ. 133.80 కోట్లను సాధించింది ఈ సినిమా.
కీర్తి సురేశ్ నాయికగా నటించగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంటీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మించిన 'సర్కారువారి పాట' సినిమా నాలుగో రోజు తెలంగాణలో రూ. 5.15 కోట్లు, రాయలసీమలో రూ. 1.48 కోట్లు వసూలు చేయగా, ఆంధ్రా ఏరియాలో రూ. 5.43 కోట్లను రాబట్టింది. దాంతో నాలుగు రోజుల్లో తెలుగునాట ఈ మూవీ వసూలు చేసిన మొత్తం షేర్ రూ. 71.12 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఈ సినిమా వసూళ్లు.. మొదటి రోజు రూ. 36.01 కోట్లు, రెండో రోజు రూ. 11.04 కోట్లు, మూడో రోజు రూ. 12.01 కోట్లుగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'సర్కారువారి పాట' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 96.50 కోట్లు. అంటే నాలుగు రోజుల్లో ఈ సినిమా 73.7 శాతం రికవరీ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. రూ. 120 కోట్ల ప్రి బిజినెస్ వాల్యూకు 71.55 రికవరీ అయ్యింది. ఈ సోమవారం నుంచి వర్కింగ్ డేస్ కాబట్టి వసూళ్లు పడిపోయే అవకాశం ఎక్కువ. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆ విషయాన్నే తెలియజేస్తున్నాయి. అందువల్ల సెకండ్ వీకెండ్ కలెక్షన్ల మీదే సినిమా ఆధారపడింది. ఏదేమైనా 100 పర్సెంట్ రికవరీ సాధ్యమై బ్రేకీవెన్ అయ్యే విషయంలో ట్రేడ్ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. చూద్దాం.. మండే టెస్ట్‌లో 'సర్కారువారి పాట' ఏ మేరకు పాస్ అవుతుందో!
![]() |
![]() |