![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొమురం భీమ్ పాత్రలో తారక్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్ లో తారక్ ఎక్స్ ప్రెషన్స్ కి నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. భీమ్ పాత్రలో అంతలా ఒదిగిపోయి మెప్పించిన తారక్.. తాజాగా మోస్ట్ పాపులర్ టాలీవుడ్ స్టార్స్ లో లిస్టులో టాప్ పొజిషన్ లో నిలిచి సంచలనం సృష్టించారు.

ఆర్మాక్స్ మీడియా రెగ్యులర్ గా సర్వే జరుపుతూ వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమల్లో టాప్-10 లో ఉన్న స్టార్ల పేర్లు ప్రకటిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ కి గాను ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వేలో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. తారక్ తర్వాతి స్థానాల్లో 2.ప్రభాస్, 3.అల్లు అర్జున్, 4.రామ్ చరణ్, 5.మహేష్ బాబు, 6.పవన్ కళ్యాణ్, 7.నాని, 8.విజయ్ దేవరకొండ, 9.చిరంజీవి, 10.రవితేజ ఉన్నారు. గతేడాది మొదటి స్థానంలో మహేష్ ఉండగా, తారక్ ఐదో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు స్థానాలు తారుమారయ్యాయి.

అలాగే టాలీవుడ్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్టులో సమంత టాప్ పొజిషన్ లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో కాజల్, అనుష్క, పూజా హెగ్డే, రష్మిక నిలిచారు. కోలీవుడ్ నుంచి మేల్ స్టార్స్ లో విజయ్, అజిత్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఫిమేల్ స్టార్స్ లో నయనతార, సమంత టాప్-2 లో నిలిచారు. టాలీవుడ్, కోలీవుడ్ రెండు ఇండస్ట్రీల నుంచి సమంత టాప్-2 లో నిలవడం విశేషం. ఇక హిందీ నుంచి మేల్ స్టార్స్ లో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఫిమేల్ స్టార్స్ లో ఆలియా భట్, దీపికా పడుకోణె టాప్-2 లో నిలిచారు.


![]() |
![]() |